Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 4:24 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని వినతి - Udayam
లేపాక్షిలో రేషన్ డీలర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం తహశీల్దార్ సౌజన్య లక్ష్మికి వినతిపత్రం సమర్పించారు. బకాయి పడిన కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలని డీలర్ల సంఘం ప్రతినిధులు గంగరత్న, అబ్దుల్ షుకూర్ కోరారు. స్థానికంగా డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రెవెన్యూ అధికారులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, బాలాజీ, అశ్వత్థ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...