Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపటి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో

Follow Udayam on Google
madhu Aug 30, 2026 11:20 AM ములుగుGeneral
రేపటి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: ఎంపీడీవో - Udayam
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో భద్రు నాయక్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజావాణి కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. మండల ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో కోరారు.

Comments

G
Loading comments...