వార్తలకు తిరిగి వెళ్లండి

పామూరు మండలం రేణిమడుగులో భూముల రీ సర్వే ప్రక్రియ పూర్తయినట్లు డిప్యూటీ ఎంఆర్ఓ శివరామ కృష్ణ తెలిపారు. రీ సర్వే పూర్తయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రతో రూపొందించిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను VRO శ్రీను, సర్వేయర్ నాగరాజుతో కలిసి బుధవారం పంపిణీ చేశారు.
పాస్ బుక్‌లోని క్యూ ఆర్ కోడ్‌తో భూమి వివరాలను రైతులు సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో రైతులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

