Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో రేపటి నుంచి రెడ్‌క్రాస్‌ సేవలు

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 13, 2026 11:54 AM విజయనగరంGeneral
చీపురుపల్లిలో రేపటి నుంచి రెడ్‌క్రాస్‌ సేవలు - Udayam
చీపురుపల్లిలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సేవలు శుక్రవారం నుంచి 24 గంటలూ అందుబాటులోకి రానున్నట్లు జిల్లా ఛైర్మన్‌ కేవీ రమణ, డివిజన్‌ అధ్యక్షుడు బీవీ గోవిందరాజులు తెలిపారు. ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు చేతుల మీదుగా సేవలు ప్రారంభం కానున్నాయి. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ కే. అప్పల నాయుడు హాజరవుతారని తెలిపారు.

Comments

G
Loading comments...