వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉపసర్పంచ్‌లకు గుర్తింపు ఇవ్వాలి

ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ఉపసర్పంచ్‌లకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఉపసర్పంచుల తాండూరు మండల అధ్యక్షురాలు కవిత అధికారులను కోరారు. ఈ మేరకు తాండూరు ఎంపీడీవో విశ్వప్రసాద్, తహసీల్దార్ కేతావత్ తారాసింగ్‌లకు ఆమె వినతిపత్రం అందజేశారు.
అధికారిక కార్యక్రమాలకు ఉపసర్పంచులను ఆహ్వానించడంతో పాటు, అభివృద్ధి పనుల శిలాఫలకాలపై కూడా వారి పేర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...