వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదిలాబాద్‌లో అరుదైన బుద్ధుని శిల్పం లభ్యం
Harika Jun 22, 2026 8:28 AM ఆదిలాబాద్ 2 viewsabout 3 hours ago

ఆదిలాబాద్ జిల్లా భీంసారి గ్రామంలో అరుదైన బుద్ధుని పరినిర్వాణ శిల్పం బయటపడింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకే రాతి స్తంభంపై నాలుగు వైపులా అరుదైన దేవతామూర్తుల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.
ఈ స్తంభంపై బుద్ధుని పరినిర్వాణంతో పాటు విష్ణుమూర్తి, వీరయోధుడు, ఉమా లింగన మూర్తి శిల్పాలు ఉన్నాయి. ఒకే స్తంభంపై ఇన్ని రకాల మతపరమైన శిల్పాలు కనిపించడం అత్యంత అరుదని చరిత్రకారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...