Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

31న అరుదైన ‘బ్లూ మైక్రో మూన్’

Follow Udayam on Google
Ravi Shukla May 29, 2026 12:37 PM జాతీయంGeneral
31న అరుదైన ‘బ్లూ మైక్రో మూన్’ - Udayam
ఈ నెల 31న ఆకాశంలో అరుదైన ‘బ్లూ మైక్రో మూన్’ ఏర్పడనుంది. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని ‘బ్లూ మూన్’ అని, చంద్రుడు భూమికి అత్యంత దూరంగా వెళ్లినప్పుడు ‘మైక్రో మూన్’ అని పిలుస్తారు. ఈ రెండు ఒకేరోజు సంభవించనుండటం విశేషం. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం, ఆ అర్ధరాత్రి చంద్రుడు భూమికి 2,52,360 మైళ్ల దూరంలో ఉంటాడు. ఈ సమయంలో చందమామ సాధారణం కంటే 6 శాతం చిన్నగా, 10 శాతం తక్కువ కాంతితో కనిపిస్తాడు.

Comments

G
Loading comments...