వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహం చేసుకుంటానని నమ్మించి ఆపై అత్యాచారం చేసిన నిందితుడు దూడల ఏడుకొండలకు ఏలూరులోని ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో సోమవారం తీర్పు వెలువడింది.
నిందితుడికి రూ.5 వేల జరిమానాతో పాటు IPC 417 కింద మరో ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ రెండు శిక్షలు ఏకకాలంలో అమలులో ఉంటాయి.
Comments
Loading comments...

