వార్తలకు తిరిగి వెళ్లండి

తన పుట్టినరోజు సందర్భంగా హీరో రామ్ పోతినేని సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. తన 23వ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ కొత్త అవతారమెత్తారు. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అధికారిక ప్రకటన నేడు వెలువడింది.
ఈ చిత్రంలో రామ్ ‘వీర’ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో, అత్యంత వైలెంట్ లుక్‌లో ఉన్న ఆయన ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Loading comments...

