వార్తలకు తిరిగి వెళ్లండి

ఉట్నూర్ మండలం తాండ్ర బాబాపూర్ ఎంపీయూపీఎస్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జాదవ్ రాజ్‌కుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. మారుమూల గ్రామాల విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి విశేషంగా కృషి చేసినందుకు ఈ గుర్తింపు దక్కింది.
రాజ్‌కుమార్ ఎంపికపై అధికారులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన అవార్డును అందుకోనున్నారు.
Comments
Loading comments...

