Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఆన్లైన్ నమోదు కోసం వ్యవసాయ అధికారి సూచనలు

Follow Udayam on Google
p.g.murthy Aug 19, 2026 12:12 PM మంచిర్యాలGeneral
రైతులకు ఆన్లైన్ నమోదు కోసం వ్యవసాయ అధికారి సూచనలు - Udayam
విత్తనాల డీలర్ల వద్ద రైతులు ఆన్లైన్ చేయించుకుంటేనే రూ. 500 బోనస్ వస్తుందని దండేపల్లి వ్యవసాయ అధికారి అంజిత్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సూచించిన ఏడు వరి రకాలతో పంటను వేసిన రైతులు డీలర్ వద్ద పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డ్, విత్తనాల రసీదులతో ఆన్లైన్ చేయించుకోవాలని సూచించారు. ఇతర విత్తనాలతో పంటను వేసిన రైతులు ఏఈఓల వద్ద విత్తన ధ్రువీకరణ పత్రాన్ని తీసుకొని నమోదు చేయించుకోవాలన్నారు.

Comments

G
Loading comments...