వార్తలకు తిరిగి వెళ్లండి

హంద్రీనీవా కాలువ నీటిని వినియోగిస్తున్న రైతుల విద్యుత్ మోటార్ల వైర్లు తొలగించడం దారుణమని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ విమర్శించారు. రైతులతో కలిసి కాలువ వెంట పర్యటించిన ఆమె, వర్షాభావంతో పంటలు ఎండిపోతున్న వేళ సాగునీరు అందించాలన్నారు.
శ్రీశైలంలో 169 టీఎంసీలకు పైగా నీరు ఉన్నా రైతులకు నీరు ఇవ్వడం లేదన్నారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.
Comments
Loading comments...

