Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు నేస్తం 100వ ఎపిసోడ్ వేడుకలు ఘనంగా నిర్వహణ

Follow Udayam on Google
AILENI VIKRAM Jul 28, 2026 8:01 PM జగిత్యాలGeneral
రైతు నేస్తం 100వ ఎపిసోడ్ వేడుకలు ఘనంగా నిర్వహణ - Udayam
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం 100వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతులు వీక్షించారు. ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా నిరంతరంగా కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులు బండారి వెంకటేష్, ప్రకాశ్ నాయక్లను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ సూచనల మేరకు ఏఈఓలు రమ్య, రాజేష్ ఘనంగా సన్మానించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ, సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...