Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా

Follow Udayam on Google
Mohammad Sep 04, 2026 4:39 PM అనంతపురంGeneral
రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ధర్నా - Udayam
కళ్యాణదుర్గం మండలం హనుమ రెడ్డిపల్లి గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం మాజీ ఎంపీ తలారి రంగయ్య రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రైతులకు సకాలంలో, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఈ ఆందోళనతో అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Comments

G
Loading comments...