వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పు విదర్భ నుంచి కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రానున్న ఐదు రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనంతో తీరంలో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఉత్తర కోస్తా మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్ళవద్దని అధికారులు సూచించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం పట్ల జాగ్రత్త వహించాలని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

