Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరుతడి పంటలకు ఊపిరినిచ్చిన వర్షాలు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 3:50 PM నల్గొండGeneral
ఆరుతడి పంటలకు ఊపిరినిచ్చిన వర్షాలు - Udayam
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురుస్తున్న మోస్తరు వర్షాలు ఆరుతడి పంటలకు ఊరటనిచ్చాయి. తొలకరి జల్లుకు విత్తిన పత్తి పంట వర్షాభావంతో వాడిపోగా, గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ చిగురిస్తోంది. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు మళ్లీ ఊపందుకున్నాయి.

Comments

G
Loading comments...