వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం రైల్వే ఫ్లాట్‌ఫారాలపై, కదులుతున్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
విజయనగరం గ్రామీణ పరిధిలోని పాతదుప్పాడ గ్రామానికి చెందిన కుమార్ అనే వ్యక్తిని GRP , RPF బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అతని వద్ద నుంచి రూ. 20 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతన్ని విశాఖ కోర్టులో హాజరు పరిచారు.
Comments
Loading comments...

