వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.బుధవారం రాయపూడి సమీపంలోని పెరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ సిబ్బంది, ఎన్‌సీసీ విద్యార్థులు కలిసి సాయుధ దళాల పెరేడ్‌ను ఉత్సాహంగా ప్రాక్టీస్ చేశారు.
ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

