Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయితీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ

Follow Udayam on Google
B RAJESH Sep 08, 2026 7:33 PM విజయనగరంGeneral
రాయితీపై పశుగ్రాస విత్తనాలు పంపిణీ - Udayam
ఎలినినో ప్రభావంతో మండలంలో వర్షాభావ ప్రభావం తక్కువగా ఉండటంతో రైతులకు రాయితీపైపశు గ్రాస విత్తనాలు పంపిణీ జరుగుతుందని ఎస్.కోట ప్రాంతీయ పశు వైద్య సహాయకులు చలపతిరావు తెలిపారు. రైతులకు 75% రాయితీపై ఈ విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఐదు కేజీల బ్యాగు రూ.115 లభిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సేవలు ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఉంటుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...