వార్తలకు తిరిగి వెళ్లండి

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా రాయికల్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ నారాయణ పాల్గొని ర్యాలీని ఉత్సాహపరిచారు.
జాతీయ జెండాలు చేతబూనిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని మచ్చ నారాయణ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

