వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు రాష్ట్రస్థాయి వారధి పోటీల్లో ప్రతిభ కనబరచాలని గుంటూరు DEO షేక్ సలీంభాష ఆకాంక్షించారు. జిల్లాస్థాయి వారధి విజేతలను గురువారం గుంటూరు పరీక్షా భవన్‌లో అభినందించారు.
ఈ నెల 26న రాష్ట్రస్థాయి వ్యాసరచన, 29న డిబేట్ పోటీలు జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ఎంచుకున్న అంశాలపై పట్టు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గౌసుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

