వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలం నూకపెల్లికి చెందిన రాయుళ్ల దీక్షిత రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు. వచ్చే నెల భద్రాద్రి కొత్తగూడెంలో జరిగే పోటీల్లో ఆమె పాల్గొననున్నారు.
మహేష్, జ్యోతి దంపతుల కుమార్తె దీక్షిత గతంలో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సెస్టోబాల్ జాతీయ పోటీల్లోనూ ప్రతిభ కనబరిచారు. ఆమె రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

