Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు నలుగురు విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 11:43 AM కామరెడ్డిGeneral
రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు నలుగురు విద్యార్థుల ఎంపిక - Udayam
బాన్సువాడ మండలంలోని తిర్మలాపూర్ క్యాంపు ( కొత్తబాది) జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆర్చరీ క్రీడలో ప్రతిభ చాటారు. దోమకొండలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన జె.లైలా, ఏ.శ్రావ్య, కె.అంజలి, ఈ. అరవింద్ రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల పీఈటీ పీరయ్య సోమవారం తెలిపారు.

Comments

G
Loading comments...