వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని రాణిపేట ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం సరఫరా చేసిన ఏకరూప దుస్తులను సర్పంచ్ మాధవి విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మోహన్, ఉప సర్పంచ్ పర్వీనా, పంచాయతీ కార్యదర్శి తులసి, ప్రభావతి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

