వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం రాంనగర్-కమలాపురం మధ్య ప్రధాన రహదారిపై కల్వర్టు వద్ద రోడ్డు కుంగి గుంత ఏర్పడింది. నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే మార్గంలో గుంతతో ప్రయాణికులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
రాత్రివేళ గుంత కనిపించక ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. వాహనదారులను అప్రమత్తం చేసేందుకు కర్రకు సంచి కట్టి గుంతలో పాతారు.
Comments
Loading comments...

