Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామతీర్థం జలాశయం నీటి విడుదల బంద్‌

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 2:25 PM ప్రకాశం General
రామతీర్థం జలాశయం నీటి విడుదల బంద్‌ - Udayam
చీమకుర్తి మండలం రామతీర్థంలోని మాగుంట సుబ్బరామిరెడ్డి జలాశయం నుంచి నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. తాగునీటి అవసరాల కోసం సాగర్‌ జలాలతో నింపిన జలాశయం నుంచి కాలువల ద్వారా జిల్లాలోని పలు చెరువులకు నీటిని విడుదల చేశారు. దీంతో జలాశయంలో నీటిమట్టం క్రమంగా తగ్గుతోంది. కొత్తగా నీరు చేరకపోతే తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...