వార్తలకు తిరిగి వెళ్లండి

యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని శనివారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవత్సవ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. సికింద్రాబాద్ డీఆర్‌ఎం డాక్టర్ గోపాలకృష్ణన్ కూడా పాల్గొన్నారు.
అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేయగా, ఈవో ఉమ్మడి భాస్కర్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవాన్ని టూరిజం గైడ్ వివరించారు.
Comments
Loading comments...

