Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో వాహనదారులకు రాఖీలు కట్టిన పోలీసులు

Follow Udayam on Google
S kumar Aug 28, 2026 12:51 PM పెద్దపల్లిGeneral
రామగుండంలో వాహనదారులకు రాఖీలు కట్టిన పోలీసులు - Udayam
రామగుండం: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని రామగుండం రాజీవ్ రహదారిపై ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను పోలీసులు అభినందించారు. మహిళా పోలీస్ సిబ్బందితో వాహనదారులకు రాఖీలు కట్టించి, మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, సక్రమ పత్రాలతో ప్రయాణించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...