వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం: రామగుండం రైల్వే స్టేషన్ ఆధునిక హంగులు, పచ్చదనంతో కొత్త శోభను సంతరించుకుంది. పారిశ్రామిక ప్రాముఖ్యతను తెలిపే ఎన్‌టీపీసీ, సింగరేణి, రాముని గుండాల చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ప్లాస్టిక్ నిషేధం, నీటి పొదుపు, పర్యావరణ పరిరక్షణ, రైలు ప్రయాణ జాగ్రత్తలపై గోడలపై గీసిన వర్ణచిత్రాలు ప్రజల్లో చైతన్యం నింపుతున్నాయి. స్టేషన్ ఆవరణ అంతా పరిశుభ్రతతో కనువిందు చేస్తోంది.
Comments
Loading comments...

