వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో వరి నాట్లు వేయని పొలాల్లో సాగు చేసేందుకు రైతులకు 80 శాతం సబ్సిడీపై పెసర విత్తనాలు అందించనున్నట్లు ఏఓ చక్రధర్ తెలిపారు. 12.24 టన్నుల విత్తనాలను 14 రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు మంగళవారం వెల్లడించారు.
4 కిలోల విత్తనాల కిట్ ధర రూ.105గా నిర్ణయించారు. రైతులు ఆధార్ కార్డు, ఓటీపీ వచ్చే ఫోన్‌తో వచ్చి విత్తనాలు పొందాలని సూచించారు.
Comments
Loading comments...

