వార్తలకు తిరిగి వెళ్లండి

రాజాం RTC కాంప్లెక్స్ ఆవరణలో సోమవారం సాయత్రం ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. విశాఖ నుంచి వచ్చిన రాజేశ్వరి అనే మహిళ బస్సు దిగి నడుస్తుండగా.. అప్పుడే బస్సుల కోసం విద్యార్థులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలో ఆ మహిళ కిందపడిపోగా అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సు మహిళ దగ్గరకు వచ్చింది.
గమనించిన విద్యార్థులు కేకలు వేయడంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సు నిలిపివేశాడు. ఈ ఘటనలో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు.
Comments
Loading comments...

