Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూజ సామగ్రి కొనుగోళ్లతో సాలూరులో రద్దీ

Follow Udayam on Google
B Ganga Sep 13, 2026 5:31 PM పార్వతీపురం మన్యంGeneral
సాలూరు పట్టణంలోని తహశీల్దార్ కూడలి, బోసు బొమ్మ జంక్షన్, పెద్ద బజార్ జంక్షన్లు ఆదివారం వినాయక చవితి పూజ సామగ్రి కొనుగోలుదారులతో రద్దీగా ఉన్నాయి. వినాయక ప్రతిమలు, పువ్వులు, పళ్లు, పత్రి కొనుగోళ్లు సాగాయి. పూజ సామగ్రిని అధిక ధరలకు అమ్ముతున్నారని, అరటి పళ్ళు డజన్ రూ.100 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారని కొనుగోలుదారులు వాపోతున్నారు.

Comments

G
Loading comments...