వార్తలకు తిరిగి వెళ్లండి

మానసిక వైకల్యంతో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన న్యాతారి రామయ్యకు పెద్దపల్లి జిల్లా కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది. 2023లో ఘటనపై జూలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కె. సునీత తీర్పు వెలువరించారు. కేసులో కృషి చేసిన పోలీసులను రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందించారు.
Comments
Loading comments...

