వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ నెల 28న పల్స్ పోలియో: చిన్నారులందరికీ చుక్కలు వేయించండి
Kumar Jun 22, 2026 8:48 AM అనంతపురం 3 viewsabout 2 hours ago

జిల్లాలో ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రకటించారు. జాతీయ ఇమ్యూనిజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు.
జిల్లాలోని 31 మండలాల్లో మొత్తం 82 కేంద్రాల ద్వారా 2,83,430 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...