వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయాల్లో కార్యక్రమం జరగనుంది.
ప్రజల వినతులను ప్రజావాణి పోర్టల్‌లో నమోదు చేసి, సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Comments
Loading comments...
