Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల వేదిక

Follow Udayam on Google
కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల వేదిక - Udayam
బాపట్ల కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించనున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లా అధికారులందరూ కార్యక్రమానికి హాజరు కావాలని కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు.

Comments

G
Loading comments...