వార్తలకు తిరిగి వెళ్లండి
పేదలు నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఎం నగర కార్యదర్శి శంకరరావు అన్నారు. విజయనగరంలోని 29వ డివిజన్లో ఆదివారం నిర్వహించిన 'వార్డుకు పోదాం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జీఓ నంబర్ 30 ప్రకారం రామకృష్ణ నగర్, ఎల్బీజీ నగర్, గురజాడ నగర్, వినాయక నగర్ తదితర ప్రాంతాల్లో పేదలు పట్టాల కోసం దరఖాస్తు చేసుకొని ఆరు నెలలు గడిచినా మంజూరు కాలేదన్నారు.
Comments
Loading comments...

