Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తి పంటకు మేలు చేస్తున్న వర్షాలు

Follow Udayam on Google
p.g.murthy Aug 18, 2026 10:11 AM మంచిర్యాలGeneral
పత్తి పంటకు మేలు చేస్తున్న వర్షాలు - Udayam
జన్నారం మండలంలో కురుస్తున్న వర్షాలు పత్తి పంటకు వరంలా మారాయి. ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయ అధికారుల సూచన మేరకు రైతులు వరి సాగు తగ్గించి పత్తి, కంది, పప్పు దినుసుల పంటలు ఎక్కువగా వేశారు. ప్రస్తుతం ఆయా పంటలు ఎదుగుదశలో ఉన్నాయి. అయితే వర్షాభావ పరిస్థితులతో నేలలో తేమశాతం తగ్గిపోవడంతో పంటల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారుతుంది. తరచూ కురుస్తున్న వర్షాలు పంటలకు మేలు చేసి వాటి ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి.

Comments

G
Loading comments...