Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

Follow Udayam on Google
B RAJESH Aug 24, 2026 9:44 PM విజయనగరంGeneral
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి - Udayam
పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి కోరారు. బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ మున్సిపల్ పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో సోమవారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించేందుకు మొక్కలు నాటి సంరక్షణ చేయాలన్నారు. పచ్చదనంతోనే కాలుష్యాన్ని నివారించవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...