వార్తలకు తిరిగి వెళ్లండి

మణుగూరు ఆర్టీసీ డిపో కండక్టర్ గుండ్ల ప్రవళిక మృతి పట్ల ఖమ్మం ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్, సిబ్బంది సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం డిపోలో ప్రవళిక చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆమెపై జరిగిన ఘటన దురదృష్టకరమని, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Comments
Loading comments...

