Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 01, 2026 7:27 PM మంచిర్యాలGeneral
ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి - Udayam
సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ కోరారు. మంగళవారం జన్నారం పోలీస్ స్టేషన్ ఆవరణలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టనీయకుండా చూసుకోవాలన్నారు. నిరాధారమైన వార్తలు, ఒకరిని కించపరిచే విధంగా పోస్టులు ఉండవద్దని ఆయన సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...