వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ దాడిని నిరసిస్తూ మెట్‌పల్లి అంబేడ్కర్ పార్క్ వద్ద బీజేపీ పట్టణశాఖ మంగళవారం ఆందోళన చేపట్టింది. పట్టణ అధ్యక్షుడు దోనికెల నవీన్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు.
దాడిలో పాల్గొన్న వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని పట్టణ అధ్యక్షుడు నవీన్ డిమాండ్ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అనూప్‌రావు, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

