వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో నాసిరకం ఆహార విక్రయాలపై ఫుడ్ సేఫ్టీ శాఖ నిర్లక్ష్యంగా ఉందని సీపీఎం రాజశేఖర్ మండిపడ్డారు. పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న స్వీట్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నిరంతర తనిఖీలు లేకపోవడంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

