Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 04, 2026 4:49 PM మేడ్చల్ మల్కాజిగిరి General
దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు - Udayam
మేడ్చల్‌లో దొడ్డి కొమురయ్య 80వ వర్ధంతి సందర్భంగా కే వై సి ఎస్ అధ్యక్షులు మరాఠీ శివెందర్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని, జనగామ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. అలాగే దొడ్డి కొమురయ్య జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం నాయకులు గొరిగే నర్సింహా, సత్యనారాయణ, సోమేశ్, విజయ్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...