వార్తలకు తిరిగి వెళ్లండి
సారపాక–మణుగూరు ఆర్‌అండ్‌బీ (R&B) రోడ్డును వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం బూర్గంపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. వర్షాల వల్ల రోడ్డు దెబ్బతిని, గుంతలు పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Comments
Loading comments...

