వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి ఆవరణలోని బావిలో పడి యువతి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన బోగం ప్రసన్న లక్ష్మి (30) బావి నుంచి నీళ్లు తోడుతుండగా ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడి నీటమునిగి ప్రాణాలు కోల్పోయింది.
మృతురాలు కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోందని కుటుంబసభ్యులు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Comments
Loading comments...

