Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించిన బండి సంజయ్

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 6:49 PM సిద్దిపేటGeneral
గజ్వేల్ శివారులో డివైడర్‌ను ఢీకొని కారు పల్టీలు కొట్టింది. ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. కారులోని దంపతులకు స్వల్ప గాయాలు కాగా.. వారి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందించి భద్రతా సిబ్బందితో కలిసి బాధితులను బయటకు తీశారు. పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...