వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో బాలుడితో గొర్రెలు కాయిస్తున్న ఘటనపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
నాగయ్య మధ్యవర్తికి రూ.32,500 ఇచ్చి నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలానికి చెందిన బాలుడిని పనిలో పెట్టుకున్నాడు. బాలుడి వీడియో వైరల్ కావడంతో మంత్రి లోకేశ్ స్పందించి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం నాగయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

