Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలు

Follow Udayam on Google
U.S.Rao Oct 06, 2026 9:02 AM కాకినాడGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాలు - Udayam
కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో ఎస్పీ జి. బిందుమాధవ్ 43 ఫిర్యాదులను స్వీకరించారు. వీటిలో భూ తగాదాలు 8, కుటుంబ కలహాలు 8, ఇతర సమస్యలు 27 ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి, ఏడు రోజుల్లో విచారణ పూర్తి చేసి చట్టపరమైన పరిష్కారం చూపాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యమన్నారు.

Comments

G
Loading comments...