వార్తలకు తిరిగి వెళ్లండి

నటుడు ప్రియదర్శి కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్, నిర్మాత బన్నీ వాస్ నిర్మాణ భాగస్వామ్యంలో ఓ క్రేజీ చిత్రం తెరకెక్కేందుకు రంగం సిద్ధమైంది. సుకుమార్ శిష్యులలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.
వినూత్న కథాంశాలతో దూసుకుపోతున్న ప్రియదర్శి, కథలకే అగ్రతాంబూలమిచ్చే నిర్మాణ సంస్థలతో చేతులు కలపడం సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికానున్నాయి
Comments
Loading comments...

